ఈడీ ఉచ్చు: తిరుమల లడ్డూ కల్తీ కేసులో రూ.129 కోట్లకు పైగా ఆస్తుల జప్తు

రిపోర్టర్: గోపి స్థలం: తిరుమల

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన చర్యలు చేపట్టిందని, రూ.129.85 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు అధికారులు వెల్లడించారు. బోలేబాబా, శ్రీవైష్ణవి డెయిరీలతో పాటు ప్రమోటర్ల ఆస్తులను పీఎంఎల్ఏ చట్టం కింద అటాచ్ చేశామని తెలిపారు. నకిలీ లావాదేవీలు మరియు హవాలా మార్గంలో నిధుల మళ్లింపుపై దర్యాప్తును మరింత వేగవంతం చేసినట్లు ఈడీ జోనల్ కార్యాలయం స్పష్టం చేసింది.