రాజమహేంద్రవరంలో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం ప్రారంభం

రిపోర్టర్: కిరణ్ స్థలం: Rajamahendravaram

రాజమహేంద్రవరంలో ALEAP ఆధ్వర్యంలో 'టెంపుల్ ఎసెన్షియల్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్' ఘనంగా ప్రారంభమైంది. మహిళలు, యువత ఆర్థికంగా ఎదిగేందుకు, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ఈ శిక్షణను చేపట్టింది. నైపుణ్యాభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి మార్గాలను సుగమం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని దిశానిర్దేశం చేశారు.