పాలనా యంత్రాంగంలో తీవ్ర సంక్షోభం: ఫైళ్లపై సంతకాలకు ఐఏఎస్ల జంకు

రిపోర్టర్: సునీల్ స్థలం: హైదరాబాద్

రాష్ట్రంలో రాజకీయ ఒత్తిళ్లు, విచారణల భయంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తీవ్ర మానసిక సంఘర్షణ ఎదుర్కొంటున్నారని సచివాలయ వర్గాలు వెల్లడించాయి. పాలకుల ఆదేశాలతో ఫైళ్లపై సంతకాలు చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని బ్యూరోక్రాట్లు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర సర్వీసులు లేదా డిప్యుటేషన్ పై వెళ్లేందుకు, కొందరు వీఆర్ఎస్ కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పాలనా యంత్రాంగంలో నెలకొన్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్ లో తీవ్ర చర్చకు దారితీశాయి.