పోలీసుల పహారాలో ప్రశాంతంగా ముగిసిన దారకొండ పంచాయతీ ఎన్నికలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: జి.కె.వీధి

అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకే వీధి మండలం దారకొండ పంచాయతీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. సీలేరు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పోలింగ్ ప్రక్రియ ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగింది. పోలింగ్ కేంద్రంలో మొత్తం 2646 ఓట్లు నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటర్లు ఉదయం నుంచే వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.