ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేయడానికి సిద్ధమన్న అనంత్ అంబానీ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
రిపోర్టర్: మహేష్
స్థలం: ఎన్టీఆర్
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో తన వంతు భాగస్వామ్యం అందించడానికి సిద్ధంగా ఉన్నానని అనంత్ అంబానీ పేర్కొన్నట్లు దేవినేని ఉమామహేశ్వరరావు - మాజీ మంత్రి, మైలవరం వెల్లడించారు. రాష్ట్రం కోసం ఏం చేయాలో చెప్పాలని ఆయన కోరారని తెలిపారు. ఇప్పటి నుంచి అనంత్ అంబానీ ఆంధ్రా ముద్దు బిడ్డ అని, మన తెలుగు బిడ్డ అని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అభివర్ణించారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఈ పరిణామంతో రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.