కర్ణాటకలో అరుదైన ఘటన: కొండచిలువను మింగిన భారీ కింగ్ కోబ్రా
రిపోర్టర్: హరి
స్థలం: కర్ణాటక
కర్ణాటకలోని బెల్తంగడి తాలూకాలో అరుదైన ఘటన వెలుగు చూసింది. సుమారు 12 అడుగుల పొడవున్న భారీ కింగ్ కోబ్రా ఒక కొండచిలువను మింగుతూ స్థానికులకు కనిపించింది. సమాచారం అందుకున్న ఉడుపికి చెందిన సర్ప సంరక్షకుడు అశోక్ అక్కడికి చేరుకుని పామును రక్షించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో కింగ్ కోబ్రా తాను మింగిన కొండచిలువను బయటకు కక్కేసింది. అనంతరం ఆ విషసర్ప సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.