టైమ్ మీది కానివ్వండి: చంద్రబాబు, పోలీసులకు వైఎస్ జగన్ తీవ్ర హెచ్చరిక

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Tadepalli

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీ నేతలు, పోలీసులు అరాచకాలకు పాల్పడుతున్నారని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. చట్టం ముందు అందరినీ దోషులుగా నిలబెడతామని, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని సీఎం చంద్రబాబుకు, అధికారులకు ఆయన ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు.