టెక్ మార్కెట్లోకి షియోమి కొత్త ఫోన్: మార్కెట్ ధర రూ. 20,999
రిపోర్టర్: నరేష్
స్థలం: Hyderabad
దేశీయ మార్కెట్లో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి సరికొత్త రెడ్మి 17సీ మొబైల్‌ను విడుదల చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పెరుగుతున్న మెమరీ ధరల కారణంగా దీని బేస్ వేరియంట్ ధర రూ. 20,999గా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ఆరు వేల ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ మరియు యాభై మెగాపిక్సెల్ కెమెరాతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని టెక్ నిపుణులు పేర్కొన్నారు.