దివాలా కోర్టును ఆశ్రయించిన ఎల్ఐవి గోల్ఫ్ టోర్నమెంట్
రిపోర్టర్: సతీష్
స్థలం: World
సౌదీ అరేబియా ప్రభుత్వ పెట్టుబడి నిధి ఆర్థిక సహాయాన్ని ఉపసంహరించుకోవడంతో ఎల్ఐవి గోల్ఫ్ అమెరికాలో చాప్టర్ 11 దివాలా రక్షణ కోరింది. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం న్యూజెర్సీ ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జాన్ రామ్, బ్రైసన్ డిచాంబావు సహా పలువురు స్టార్ గోల్ఫ్ క్రీడాకారులకు కోట్లాది రూపాయలు బకాయిపడినట్లు కోర్టు పత్రాలు వెల్లడించాయి.