నీట్ ఎస్ఎస్ కౌన్సెలింగ్ అర్హత పర్సంటైల్ ముప్పైకి తగ్గింపు

రిపోర్టర్: కిరణ్ స్థలం: తెలంగాణ

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నీట్ ఎస్ఎస్ కౌన్సెలింగ్కు సంబంధించి స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ను నిర్వహిస్తున్నట్లు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ప్రకటించింది. ఈ కొత్త ఏర్పాట్లలో భాగంగా సూపర్ స్పెషాలిటీ కౌన్సెలింగ్ అర్హత పర్సంటైల్ను యాభై నుండి ముప్పై శాతానికి తగ్గించినట్లు అధికారులు వెల్లడించారు. రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత భర్తీ కాకుండా మిగిలిపోయిన ఖాళీ సీట్ల భర్తీకి ఈ రౌండ్ దోహదపడుతుందని పేర్కొన్నారు.