రేపల్లె మున్సిపల్ ఎన్నికలు: సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని పిలుపు
రిపోర్టర్: హరి
స్థలం: బాపట్ల
రేపల్లె పట్టణ సమగ్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని రెవెన్యూ శాఖ మంత్రి, రేపల్లె ఎమ్మెల్యే ఆనగాని సత్య ప్రసాద్ స్పష్టం చేశారు. నవంబర్ ఒకటో తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌పై రెండు క్రమ సంఖ్యలో ఉన్న సైకిల్ గుర్తుకు ఓటు వేసి, ఎన్డీయే కూటమి తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి కుర్రా అవర్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.