ఆంధ్రప్రదేశ్ పరిషత్ పోలింగ్ లో తీవ్ర ఉద్రిక్తత: పెట్రోల్ బాంబులతో దాడుల కలకలం

రిపోర్టర్: కిరణ్ స్థలం: కడప

ఆంధ్రప్రదేశ్ లో పరిషత్ పోలింగ్ సందర్భంగా పలు ప్రాంతాలలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయని పోలీసులు తెలిపారు. కడప, తిరుపతి జిల్లాలలో పోలింగ్ కేంద్రాల వద్ద పెట్రోల్ బాంబులతో దాడులు జరగడంతో భారీగా మంటలు చెలరేగాయి. పులివెందుల మండలం ఎర్రిపల్లె మరియు పెనగలూరు మండలంలో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.