గోదావరిలో సీజన్కు ముందే ప్రత్యక్షమైన చీరమేను చేప

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: యానాం

గోదావరి నదిలోకి సీజన్కు ముందే చీరమేను చేపలు వచ్చాయని మత్స్యకారులు తెలిపారు. యానాం గౌతమీ గోదావరి నదీ ప్రవాహంలో అరుదైన ఈ చేపలు లభ్యమయ్యాయని, తూర్పు గాలులు వీస్తుండడంతో ఇవి తక్కువ సంఖ్యలో చిక్కాయని చెప్పారు. వేలంలో పది లీటర్ల బకెట్ చీరమేను చేపలను 26 వేల రూపాయలకు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ఈ రుచికరమైన చేపల కోసం మాంసాహార ప్రియులు ఎంత ధర వెచ్చించడానికైనా వెనుకాడడం లేదని స్పష్టం చేశారు.