గాయపడిన బాలిక గోపిక వైద్యానికి రెండు లక్షల నిధులు విడుదల
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: అనంతపురం
అనంతపురం జిల్లా రాప్తాడులో ఉన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన బాలిక గోపికకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తరఫున రూ. 2 లక్షలు విడుదల చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు అనంతపురం ఆసుపత్రి అభివృద్ధి నిధి నుంచి ఈ మొత్తాన్ని బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి చెల్లించారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతోందని వైద్యులు వెల్లడించారు.