రూ.15 కోట్లతో మున్సిపాలిటీ అభివృద్ధికి శంకుస్థాపన చేసిన కోమటిరెడ్డి

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో రూ.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత రహదారులు, డ్రైనేజీల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం శంకుస్థాపన చేశారు. అంజనా సాయి మేడోస్ కాలనీ, రాజేంద్రనగర్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. పురపాలిక చైర్మన్ మొగుదాల పావని రమేష్గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ పాల్గొన్నారు. పనులు పూర్తయితే కాలనీల ప్రజలకు రాకపోకలు, పారిశుద్ధ్య సమస్యలు మెరుగుపడనున్నాయి.