చిన్నారులకు ఆలోచింపజేసేలా జయంత్ అండ్ ది జింగో పెన్ చిత్రం
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
నవీన్ దేశబోయిన దర్శకత్వంలో తెరకెక్కిన జయంత్ అండ్ ది జింగో పెన్ సినిమా ట్రైలర్ ను తాజాగా ప్రైవేట్ స్కూల్ లో విడుదల చేశారు. విద్యా వ్యవస్థలోని అంశాలపై ఈ చిత్రం రూపొందిందని నిర్మాత ప్రవీణ్ బొలిశెట్టి తెలిపారు. నవంబర్ 12న చిల్డ్రన్స్ డే కానుకగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.