స్థానిక సంస్థల అభ్యర్థుల అఫిడవిట్లు ఆన్లైన్లో ఉంచాలని ఎస్ఈసీ నిర్ణయం
రిపోర్టర్: రాజేష్
స్థలం: Amaravati
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాలు మరియు అఫిడవిట్లను అధికారిక వెబ్సైట్లో ఉంచనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్లు ఎస్ఈసీ అధికారులు తెలిపారు. నూజివీడుకు చెందిన శివకార్తీక్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఈ నిర్ణయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసి ఎన్నికల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్ఈసీ వెల్లడించింది.