రాష్ట్రాలకు వేస్ అండ్ మీన్స్ పరిమితి పెంచాలని ఆర్బీఐ సిఫార్సు

రిపోర్టర్: కిరణ్ స్థలం: దిల్లీ

స్వల్పకాలిక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే వేస్ అండ్ మీన్స్ పరిమితిని 11.2 శాతం మేర పెంచాలని ఆర్బీఐ సలహా కమిటీ సిఫార్సు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనివల్ల రాష్ట్రాలకు నెలవారీగా అందే చేబదుళ్ల సాయం రూ.61,008 కోట్ల నుంచి రూ.67,839 కోట్లకు పెరగనుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ పరిమితి రూ.2,921 కోట్ల నుంచి రూ.3,197 కోట్లకు పెరుగుతుందని కమిటీ పేర్కొంది. ఓవర్డ్రాఫ్ట్ నిబంధనలను కఠినతరం చేయడంతో పాటు, సింకింగ్ ఫండ్లో నిధులు పెంచాలని సూచించింది.