హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో డిసెంబర్ నాటికి కొత్త ఐమ్యాక్స్ స్క్రీన్ ప్రారంభం

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న ఏఎంబీ క్లాసిక్ విక్టరీ ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో కూడిన కొత్త ఐమ్యాక్స్ స్క్రీన్ ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. గత 12 ఏళ్లుగా నగరంలో సరైన ఐమాక్స్ అనుభూతి లేదనే వెలితిని తీర్చేందుకు వస్తున్న ఈ స్క్రీన్‌పై హాలీవుడ్ చిత్రం డ్యూన్ పార్ట్ త్రీని ఫస్ట్ ఓపెనింగ్ మూవీగా ప్రదర్శించే అవకాశం ఉందనే వార్త సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.