మధ్యప్రదేశ్ నదిని ఒంటరిగా శుభ్రం చేస్తున్న యువకుడు
రిపోర్టర్: గోపి
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాకు చెందిన సురేంద్ర సింగ్ చౌదరి, అజ్నార్ నదిని శుభ్రం చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. గణతంత్ర దినోత్సవం రోజున మొదలుపెట్టిన ఈ పర్యావరణ ఉద్యమాన్ని, ఎటువంటి సహాయం లేకపోయినా ఒంటరిగా కొనసాగిస్తున్నాడు. ఆనంద్ మహీంద్రా ఇతని కృషిని సోషల్ మీడియాలో ప్రశంసించడంతో, ఈ యువకుడి పట్టుదల దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. కలుషిత నీటిలో దిగి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తూ నదికి కొత్త కళ తెస్తున్నాడు.