తీవ్ర ఆరోగ్య ముప్పు: దేశంలో పెరుగుతున్న దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు

రిపోర్టర్: హరి స్థలం: తెలంగాణ

భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి తీవ్రమైన ప్రజాారోగ్య సవాలుగా మారుతున్నట్లు వైద్య నిపుణులు స్పష్టం చేశారు. మధుమేహం, అధిక రక్తపోటు, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా కిడ్నీల పనితీరు దెబ్బతింటున్నదని తెలిపారు. వ్యాధి ప్రారంభ దశల్ లో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల చాలా మంది ఆలస్యంగా వైద్యులను ఆశ్రయిస్తున్నారని పేర్కొన్నారు. తగిన పరీక్షలతో వ్యాధిని ముందుగానే గుర్తించి, నియంత్రించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.