పలాసలో డాక్టర్ కణితి విశ్వనాథం కాంస్య విగ్రహ ఏర్పాటుకు వినతి
రిపోర్టర్: Dinesh panda
స్థలం: పలాస
పలాస కాశీబుగ్గ మూడు రోడ్ల కూడలిలో దివంగత మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు పాలవలస వైకుంఠరావు, రామానంద స్వామీజీ శనివారం అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. విద్య, వైద్య రంగాలలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విగ్రహ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ తగిన స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.