పేదల సంక్షేమాన్ని ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయంటూ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
రిపోర్టర్: సునీల్
స్థలం: Vijayawada
పేదలకు ఇళ్లు ఇస్తుంటే కోర్టులు, లేఖల ద్వారా ప్రతిపక్ష పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీటిని అందిస్తామని స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. రాక్షసులు యజ్ఞాలను అడ్డుకున్నట్లుగా గొడ్డలి పార్టీ రాష్ట్రంలో సంక్షేమాన్ని అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు.