ఏలూరు రూరల్ లో భారీగా గంజాయి స్వాధీనం
రిపోర్టర్: శివ
స్థలం: ఏలూరు
ఏలూరు రూరల్ పోలీసుల వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. సుమారు 42.775 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎస్సై వి. వెంకటేశ్వరరావు మరియు సిబ్బంది ఈ తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను భగ్నం చేశారు.