పులివెందులలో టీడీపీ సంచలన విజయం: కడపలో క్షేత్రస్థాయిలో జోరు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: పులివెందుల
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారని అధికారులు తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలోని పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి భారతి కైవసం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి సావిత్రిపై ఆమె ఘన విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా పలు జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.