ట్యాంక్ బండ్ నీటిలో కన్నకూతురిని తోసేసిన తల్లి: అప్రమత్తమైన డ్రైవర్ రక్షణ
రిపోర్టర్: వెంకట్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ ప్రాంతంలో కన్నతల్లి తన కుమార్తె రుక్సానాను నీటిలో నూకిన అమానుష ఘటన కలకలం రేపిందిని పోలీసులు తెలిపారు. అటుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ సకాలంలో స్పందించి ఆ చిన్నారిని ప్రాణాలతో రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పాపను గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరారీలో ఉన్న తల్లి శబనా కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.