ఒడిశాలో ఐదు ఒరాంగుటాన్ల లభ్యం, వన్యప్రాణుల స్మగ్లింగ్ అనుమానం
రిపోర్టర్: సతీష్
స్థలం: ఒడిశా
ఒడిశాలోని బాలాసోర్ జిల్లా బిచిత్రాపూర్ అడవిలో ఐదు ఒరాంగుటాన్ పిల్లలను అటవీశాఖ అధికారులు రక్షించారు. ఇండోనేషియా, మలేషియా ప్రాంతాలకు మాత్రమే చెందిన ఈ జంతువులు భారతదేశంలో లభించడం వన్యప్రాణుల అక్రమ రవాణాను స్పష్టంగా సూచిస్తోందని ఇండోనేషియా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. సుమత్రా జాతికి చెందినవిగా భావిస్తున్న ఈ జంతువుల మూలాలను గుర్తించి, తిరిగి అప్పగించేందుకు భారత అధికారులతో సమన్వయం చేసుకుంటున్నట్లు వెల్లడించింది.