ఛలో విజయవాడ కార్యక్రమానికి ఎవరూ వెళ్లవద్దంటూ కాకినాడ ఎస్పీ విజ్ఞప్తి
రిపోర్టర్: కిరణ్
స్థలం: కాకినాడ
విజయవాడలో సెప్టెంబరు 27న నిర్వహించనున్న ఛలో విజయవాడ కార్యక్రమానికి జిల్లా నుంచి ఎవరూ వెళ్లరాదని కాకినాడ ఎస్పీ జి. బిందు మాధవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం వరద పరిస్థితుల నేపథ్యంలో అత్యవసర సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉందని తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పోలీసు, రెవెన్యూ అలాగే విపత్తు నిర్వహణ శాఖల సిబ్బందికి ప్రజలు, వివిధ వర్గాల వారు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అందరూ నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు.