నిరుద్యోగులకు గుడ్ న్యూస్: ఏఈఈ హాల్ టికెట్లు విడుదల చేసిన టీజీపీఎస్సీ
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: తెలంగాణ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టుల రాత పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. నవంబర్ ఆరు మరియు ఏడు తేదీలలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. డౌన్ లోడ్ చేసుకునే సమయంలో అభ్యర్థులు లైవ్ ఫోటోగ్రాఫ్ సమర్పించడం తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు.