పారా క్రీడాకారుల ఢిల్లీ హైకోర్టు పిటిషన్: సెలెక్షన్ వివాదంపై ఉత్కంఠ
రిపోర్టర్: అశోక్
స్థలం: New Delhi
ఆసియా పారా క్రీడల ఎంపికలో అన్యాయం జరిగిందని ప్రముఖ పారా షట్లర్ చిరాగ్ బరేథా తెలిపారు. నిబంధనలు పాటించలేదంటూ సహచర క్రీడాకారులతో కలిసి ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. తాము ఆసియాలో టాప్ ఆరు ర్యాంకుల్లో ఉన్నప్పటికీ అనర్హులమయ్యామని పిటిషన్లో పేర్కొన్నారు. అర్హతలు లేని డోపింగ్ నిందితులకు చోటు కల్పించారని, ఈ ఎంపిక ప్రక్రియలో తీవ్ర నిబంధనల ఉల్లంఘన జరిగిందని న్యాయస్థానానికి వివరించారు.