పల్లా శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసిన కూరపాటి శంకర్ రెడ్డి

రిపోర్టర్: మదన్ రాయల్ స్థలం: తిరుపతి

తిరుపతిలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ను సత్యవేడు నియోజకవర్గ టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతంపై ఇరువురు నేతలు చర్చించారు.