సూర్యాపేటలో మెగా కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటుకు అక్టోబర్ 6న శంకుస్థాపన

రిపోర్టర్: రాము స్థలం: సూర్యాపేట

సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో తొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న మెగా కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ డిజైన్ను ఉద్ధం కుమార్ రెడ్డి విడుదల చేశారు. అక్టోబర్ ఆరో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రెండు వేల ఇరవై ఏడు మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.