ముస్సూరి కొండల్ లో దారుణం: పర్యాటక ప్రాంతంలో చెత్త ఏరిన విదేశీ యువతి

రిపోర్టర్: కిరణ్ స్థలం: Mussoorie

ఉత్తరాఖండ్ లోని ముస్సూరి దలై హిల్స్ లో పర్యాటకులు పారేసిన చెత్తను తైవాన్ దేశానికి చెందిన విదేశీ యువతి స్వచ్ఛందంగా ఏరివేశారని డిజిటల్ క్రియేటర్ ఆనంత్ ఎం తెలిపారు. స్థానికులు, పర్యాటకులు ఎవరూ పట్టించుకోకుండా చూస్తున్నప్పటికీ, ఆమె మాత్రం బాధ్యతగా చెత్తాచెదారాన్ని సేకరించి సంచిలో వేశారని పేర్కొన్నారు. మన దేశాన్ని విదేశీయులు శుభ్రం చేయడం సిగ్గుచేటని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాలలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు.