ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి కేసులో కలకలం

రిపోర్టర్: శివ స్థలం: రంగారెడ్డి

ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఫిర్యాదు చేసి 16 రోజులు గడుస్తున్నా నిందితుడిని ఎందుకు అరెస్ట్ చేయలేదంటూ ఫోక్ డాన్సర్ మాధురి పోలీసులను నిలదీశారు. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఈశ్వర్ సాయితో పాటు ఆయన భార్య శరణ్య, సంధ్యారాణిపై కేసు నమోదు చేయాలని ఆమె నూతన ఫిర్యాదు అందజేశారు. 24 గంటల్లో నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.