ఎన్నికల సంఘం అంతర్గత విభేదాల వార్తలపై స్పందించిన ఈసీ
రిపోర్టర్: శివ
స్థలం: న్యూఢిల్లీ
ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు తలెత్తాయన్న వార్తలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చింది. ఈసీ సమావేశాల వాయిదా కేవలం సాధారణ పరిపాలనా కారణాల వల్లే జరిగిందని అధికారులు వెల్లడించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఏకగ్రీవంగానే నిర్ణయాలు తీసుకున్నామని ఈసీ స్పష్టం చేసింది. సీఈఐ జ్ఞానేశ్ కుమార్ హాజరుకావాల్సిన రెండు సదస్సులను ముందుగానే వాయిదా వేసినట్లు తెలిపారు. విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను ఖండిస్తూ పాలనాపరమైన ప్రక్రియను వివరించారు.