భీమవరంలో ఘనంగా శోభారాజు శిష్యుల అన్నమయ్య సంకీర్తనా గానం

రిపోర్టర్: నరేష్ స్థలం: పశ్చిమ గోదావరి

భీమవరంలో శ్రీ విద్యా గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా పద్మశ్రీ శోభారాజు శిష్యులు అన్నమయ్య సంకీర్తనలతో అలరించారు. ఉమా సోమేశ్వర గునుపూడి బ్రాహ్మణ సమాఖ్య, అన్నపూర్ణ మ్యుజికల్ అకాడమీ ఆధ్వర్యంలో ఈ వేడుక ఘనంగా జరిగింది. 'అదివో అల్లదివో', 'కొండలలో నెలకొన్న' వంటి కీర్తనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు శోభారాజు దంపతులను ఘనంగా సత్కరించారు.