పాఠశాల సాంబార్‌లో విష రసాయనం: నిందితుడు అరెస్ట్
రిపోర్టర్: శివ
స్థలం: ఈరోడ్, తమిళనాడు
ఈరోడ్ జిల్లాలోని రామబయలూరు పాఠశాలలో విద్యార్థులకు వడ్డించే సాంబార్‌లో విషపూరిత రసాయనాన్ని కలిపేలా మైనర్ బాలికను ప్రేరేపించిన బి.అరుముగంను పోలీసులు అరెస్టు చేశారు. తన భార్యను వంట మనిషి ఉద్యోగం నుండి తొలగించినందుకు కక్ష కట్టిన అరుముగం, ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఉపాధ్యాయురాలు రుచి చూడటానికి ఉంచిన సాంబార్‌లో రసాయనం కలవడంతో ప్రమాదం తప్పింది. నిందితుడి భార్య కోసం గాలింపు కొనసాగుతోంది.