పురపోరులో మహిళా ఓటర్లదే హవా: విజయనగరం మున్సిపాలిటీల్ లో నిర్ణయాత్మకంగా వనితలు
రిపోర్టర్: హరి
స్థలం: విజయనగరం
విజయనగరం నగరపాలక సంస్థతో పాటు బొబ్బిలి, నెల్లిమర్ల మున్సిపాలిటీల్ లో మహిళా ఓటర్లు అత్యంత కీలకమని పలువురు విశ్లేషకులు తెలిపారు. పురుషుల కన్నా తొమ్మిది వేలకు పైగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఎన్నికల ఫలితాలను వారే శాసించనున్నారు. ఓట్లలోనే కాకుండా పోటీలోనూ పురుషులకు దీటుగా వనితలు బరిలో నిలిచారు. ఉపాధి అవకాశాలు కల్పించే నాయకులకే తాము పట్టం కడతామని మహిళా ఓటర్లు స్పష్టం చేస్తున్నారు.