ఆంధ్రప్రదేశ్ లో సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్ ఏర్పాటుకు లోకేష్ ఆహ్వానం
రిపోర్టర్: అశోక్
స్థలం: ಅహ్ಮదాబాద్
ఆంధ్రప్రదేశ్ లో సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విశాఖ గ్రూప్ ఎండి జిగీష్ భాష్ దోషిని ఐటీ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్ లో కోరారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో ఏపీ శరవేగంగా దూసుకుపోతోందని ఆయన తెలిపారు. నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం, అనకాపల్లిలో ప్యాకేజింగ్ యూనిట్ ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని జిగీష్ దోషి స్పష్టం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.