సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమంటూ వామపక్షాల నిప్పులు
రిపోర్టర్: కిరణ్
స్థలం: విజయవాడ
ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఇద్దరు చెప్పిన మాట వినకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీరు ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని వామపక్ష పార్టీల రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మండిపడ్డారు. విజయవాడలో జరిగిన వామపక్ష నేతల సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. సీఈసీ ఏకపక్ష నిర్ణయాల వల్ల కోట్ల ఓట్లు తొలగిపోయాయని ఆరోపించారు. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 2 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టి, అక్టోబర్ 2న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.