విజయవాడలో పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీపై నారా లోకేష్ హర్షం

రిపోర్టర్: విజయ్ స్థలం: గుంటూరు

విజయవాడలో ఇల్లు కట్టుకుని నివసిస్తున్న పేదలకు శాశ్వత హక్కు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. పేద ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ వారికి చట్టబద్ధమైన యాజమాన్య హక్కులను కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల కుటుంబాల్లో కొత్త వెలుగులు నిండుతాయని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందేలా కూటమి ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని ఆయన స్పష్టం చేశారు.