నేరాలకు సినిమాలను బలిపశువును చేయడం సరికాదంటూ దర్శకుడు సందీప్ వంగా ఫైర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: హైదరాబాద్

ఘోరమైన నేరాలు జరిగినప్పుడు సినిమాలను బలిపశువును చేయడం తగదని ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అభిప్రాయపడ్డారు. ఇటీవల జరుగుతున్న దారుణ ఘటనలపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. విషాదాలను ఆసరాగా చేసుకుని అవకాశవాదంతో సామాజిక సంస్కర్తలుగా అవతారం ఎత్తుతున్న వారిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాధితుల పట్ల నిజమైన ఆందోళన లేని పరాన్నజీవులే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని దర్శకుడు సందీప్ వంగా స్పష్టం చేశారు.