జి మాడుగుల మదిగరువు వారపు సంతలో కురిసిన భారీ వర్షం
రిపోర్టర్: SINDERI KAMESH
స్థలం: జి.మాడుగుల
అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం మదిగరువు వారపు సంతలో గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా వచ్చిన వానతో చిరు వ్యాపారులు అలాగే కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా వ్యాపారాలు పూర్తిగా దెబ్బతిన్నాయి మరియు సంతలో జనజీవనం కొంతసేపు స్తంభించిపోయింది.