యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బస్సుకు మంటలు తొమ్మిది మంది దుర్మరణం

రిపోర్టర్: వెంకట్ స్థలం: గ్రేటర్ నోయిడా

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడా యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దిల్లీ నుంచి మహోబా వెళ్తున్న స్లీపర్ టూరిస్ట్ బస్సుకు ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆయన ఆదేశించారు.