మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచం ఇంకా సిద్ధంగా లేదన్న డబ్ల్యూహెచ్‌ఓ

రిపోర్టర్: శివ స్థలం: న్యూయార్క్

భవిష్యత్తులో రాబోయే మహమ్మారులను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో సిద్ధంగా లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ గెబ్రేయేసస్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ, కేవలం రాజకీయ హామీలు సరిపోవని, వాటిని ఆచరణలో పెట్టాలని ప్రపంచ దేశాల నాయకులకు పిలుపునిచ్చారు.