ఓట్ల తొలగింపు కుట్రలపై కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఎమ్మెల్యే కుంభం అనిల్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: భువనగిరి

భువనగిరి పట్టణంలో నిర్వహించిన ఓట్ బచావో దేశ్ బచావో కార్యక్రమంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ ప్రక్రియ పేరుతో ఓట్లను తొలగిస్తోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు. ఎన్నికల సంఘం ఏకపక్ష నిర్ణయాలతో ఓటు హక్కును కాలరాస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.