సస్పెండయిన డీఎస్పీ భీంరెడ్డి కేసులో పది ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
సస్పెండయిన డీఎస్పీ సంకిరెడ్డి భీంరెడ్డి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా గురువారం హైదరాబాద్, జహీరాబాద్‌లలోని పది ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. భీంరెడ్డి బినామీగా భావిస్తున్న బొమ్మా వెంకటేశ్ ఇంట్లో ఏకంగా కోటీ ముప్పై ఐదు లక్షల రూపాయల నగదు లభించింది. ఈ సోదాలలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా పాల్గొని తనిఖీలు చేపట్టడంతో పాటు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.