దేశ సేవలో మోదీ నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని రడగంబల బస్తీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ జన్మదిన వేడుకలను మోదీ క్యాంటీన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని పిలుపు మేరకు ఆశీర్వాద దీపం వెలిగించారు. మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, దేశ సేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.