తపాలపూర్ గ్రామంలో కుష్టి వ్యాధి నిర్ధారణపై అవగాహన కార్యక్రమం నిర్వహణ

రిపోర్టర్: Alfa News Desk స్థలం: తపాలపూర్

జన్నారం మండలం తపాలాపూర్ గ్రామంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో కుష్టి వ్యాధి నిర్ధారణ ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శించి చర్మంపై మచ్చలు, స్పర్శ లేకపోవడం వంటి లక్షణాలను గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించారు. వ్యాధి సోకిన వారికి ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచితంగా మందులు అందజేస్తామని, సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా అంగవైకల్యాన్ని పూర్తిగా నివారించవచ్చని హెల్త్ అసిస్టెంట్ తెలిపారు.