దేశంలోనే తొలి ఎల్ఎన్జీ రైలును ప్రారంభించిన అమిత్ షా
రిపోర్టర్: సురేష్
స్థలం: అహ్మదాబాద్
భారత రైల్వే చరిత్రలో మరో కీలక అడుగు పడింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో దేశంలోనే తొలిసారిగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్‌తో నడిచే రైలును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ రైలు ఎల్ఎన్జీతో పాటు డీజిల్‌ను ఉపయోగించే డ్యూయెల్ ఫ్యూయల్ టెక్నాలజీతో నడవనుందని వెల్లడించారు. సబర్మతి నుంచి మహెసానా వరకు ప్రయోగాత్మకంగా నడపనున్న ఈ రైలు సంప్రదాయ డీజిల్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని, రవాణా రంగంలో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంలో ఈ నూతన సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.